: కరోడ్ పతి బెగ్గర్... కువైట్ లో బిచ్చగాడి ఖాతాలో రూ.10 కోట్లు!
కువైట్ లోని ఓ మసీదు వద్ద బిచ్చమెత్తుకుంటున్న ఓ బెగ్గర్ సంపద చూసి అక్కడి పోలీసులు నోరెళ్లబెట్టారు. లెక్కలేనన్ని బాధల్లో కూరుకుపోయిన తనకు ఇల్లు కూడా లేదని చెబుతూ బిచ్చమెత్తుకుంటున్న సదరు బెగ్గర్ కు అక్కడి ఓ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.10 కోట్ల మేర డిపాజిట్లున్నాయని తెలిస్తే పోలీసులు ఆశ్చర్యపోక ఏం చేస్తారు చెప్పండి? వివరాల్లోకెళితే... కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, దుబాయ్ వంటి దేశాల్లో బిచ్చమెత్తడం నేరం. కొందరు విదేశీయులు ఆ దేశాల్లో బిచ్చమెత్తుకోవడాన్ని లాభసాటి వ్యాపారంలా భావిస్తున్నందునే ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో కువైట్ లోని ఓ మసీదు ముందు బిచ్చమెత్తుకుంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా అక్కడి ఓ బ్యాంకు శాఖలో తనకో ఖాతా ఉందని, అందులో రూ.10 కోట్ల మేర డబ్బుందని అతడు ఒప్పుకున్నాడు.