: ముస్లింలకు 'చంద్రన్న రంజాన్ తోఫా'
సంక్రాంతి వేళ హిందువులకు ఉచితంగా 'చంద్రన్న కానుక' పేరిట సరుకులను అందించిన ఏపీ సర్కారు, రంజాన్ సందర్భంగా ముస్లింలకు కూడా అదే తరహా కానుక ఇవ్వనుంది. 'చంద్రన్న రంజాన్ తోఫా' పేరిట ముస్లిింలకు రూ.400 విలువ చేసే సరుకులను ఉచితంగా అందిస్తారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. 11 లక్షల మంది మైనార్టీలకు రూ.31 కోట్ల వ్యయంతో రంజాన్ తోఫా అందిస్తారు. ఈ నెల 14 నుంచి 17 వరకు రంజాన్ తోఫా కింద సరుకులు పంపిణీ చేస్తారు. ఇక, జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇఫ్తార్ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 17న విజయవాడలో జరిగే ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొంటారు.