: నిజాం కాలేజ్ మైదానంలో తెలంగాణ సర్కారు ఇఫ్తార్ విందు


రంజాన్ మాసం పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం హైదరాబాదు నిజాం కళాశాల మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, కేకే తదితరులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా ఇఫ్తార్ విందుకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మతపెద్దలు ఇఫ్తార్, రంజాన్ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News