: భువీ స్వింగ్ కు తడబడిన జింబాబ్వే టాపార్డర్... 20 ఓవర్లలో 79/3
హరారే వన్డేలో 272 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే జట్టును టీమిండియా యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ దెబ్బతీశాడు. భువీ ధాటికి స్టార్ ఆటగాడు హామిల్టన్ మసకద్జా (5), కెప్టెన్ ఎల్టన్ చిగుంబురా (9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అంతకుముందు, ధవళ్ కులకర్ణి ఓపెనర్ సిబందా (2) ను పెవిలియన్ చేర్చాడు. దీంతో, జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఆ జట్టు ఇంకా 193 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉండగా, ఇంకా 30 ఓవర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో చిభాభా (44 బ్యాటింగ్), విలియమ్స్ (15 బ్యాటింగ్) ఉన్నారు.