: పాతబస్తీలో బాహుబలి సీడీలు హల్ చల్... 115 సీడీలు స్వాధీనం చేసుకున్న సౌత్ జోన్ పోలీసులు


భారీ బడ్జెట్ తో నిర్మితమైన ప్రతిష్ఠాత్మక జానపద చిత్రం 'బాహుబలి'కి పైరసీ బెడద తప్పలేదు. ఈ సినిమా పైరసీ సీడీలను హైదరాబాదు పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సౌత్ జోన్ పోలీసులు మీర్ చౌక్ లో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద 115 సీడీలను పట్టుకున్నారు. కాగా, శనివారం ఉదయం బాహుబలి హిందీ వెర్షన్ చిత్రం ఆన్ లైన్ లో దర్శనమివ్వడం తెలిసిందే. బాహుబలి పైరసీని గుర్తించిన పుణే పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News