: కేకే, డీఎస్ లపై విమర్శల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ నేతలు ఆదివారం గాంధీభవన్ లో సమావేశమయ్యారు. పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లిన నేతలపై ఈ సందర్భంగా పలువురు విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా, కేకే, డీఎస్ లపై విరుచుకుపడ్డారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కేకే కాంగ్రెస్ లో పులిలా ఉండేవారని, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాక ఆయన పిల్లిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. డీఎస్ డబ్బులు తీసుకుని బి-ఫారాలు ఇచ్చారని ఆరోపించారు. ఇక, పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కొందరు పదవులు అనుభవించి సిగ్గులేకుండా పార్టీని వీడారని మండిపడ్డారు. పార్టీ పెట్టిన భిక్షతో ఎదిగారని అన్నారు. టీఆర్ఎస్ ప్రలోభాలు, బెదిరింపులతో నేతలను పార్టీలో చేర్చుకుంటోందని విమర్శించారు. కేకే, డీఎస్ పార్టీకి అన్యాయం చేశారని మరో నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.