: ములాయంపై ఫిర్యాదు చేసిన ఐజీపై రేప్ కేసు


ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఐజీ అమితాబ్ ఠాకూర్ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ మరుసటి రోజే ఐజీపై రేప్ కేసు నమోదవడం సమస్య తీవ్రతకు దర్పణం పడుతోంది. ములాయం తనను ఫోన్లో బెదిరించారని ఠాకూర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఘజియాబాద్ కు చెందిన ఓ యువతి తెరపైకి వచ్చి, కిందటేడాది ఠాకూర్ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. ఘటనలో ఠాకూర్ భార్య నూతన్ కూడా భర్తకు సహకరించినట్టు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, ఆదివారం లక్నోలోని గోమతి నగర పోలీసులు ఠాకూర్ పైనా, ఆయన భార్య నూతన్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  • Loading...

More Telugu News