: 'తిరుమల' విషయం రక్షణశాఖ చూసుకుంటుంది... మా పరిధిలోకి రాదు: అశోక్ గజపతిరాజు
తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా ఇటీవల ఓ విమానం వెళ్లడంతో తీవ్ర కలకలం రేగడం తెలిసిందే. దీంతో, తిరుమల పుణ్యక్షేత్రాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ... తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించే అంశం తమ పరిధిలో లేదని స్పష్టం చేశారు. అది రక్షణశాఖకు సంబంధించిన విషయం అని వివరించారు. ఆదివారం ఆయన తిరుమల విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక, పుష్కర మహోత్సవాల కోసం రాజమండ్రికి విమానాలు నడిపేందుకు ఎన్నో సంస్థలు ముందుకువచ్చాయని మంత్రి తెలిపారు.