: మరోసారి టాస్ గెలిచిన జింబాబ్వే... 10 ఓవర్లలో భారత్ 39/0
టీమిండియా, జింబాబ్వే మధ్య హరారేలో రెండో వన్డే ఆరంభమైంది. తొలి వన్డేలో టాస్ నెగ్గిన ఆతిథ్య జింబాబ్వే మరోసారి టాస్ నెగ్గి భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో, బ్యాటింగ్ కు దిగిన టీమిండియా సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ఆడుతోంది. ఓపెనర్లు రహానే, విజయ్ అనవసరమైన షాట్లకు ప్రయత్నించకుండా, నిలకడకు ప్రాధాన్యమిస్తున్నారు. భారత్ ఈ మ్యాచ్ లో 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. రహానే 20 పరుగులతో, విజయ్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వన్డేలో టీమిండియా నెగ్గిన సంగతి తెలిసిందే.