: 'ఓటుకు నోటు' వెనుక అసలు స్టోరీ వేరే ఉందంటున్న మాజీ ఎంపీ!


సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వెనుక అసలు కథ వేరే ఉందని తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, మాజీ మంత్రులు కలసి కేసీఆర్ సర్కారును కూల్చాలని ప్రయత్నించారని ఆరోపించారు. వీరందరూ తమకు హైదరాబాదులో ఉన్న వెయ్యి ఎకరాలకు పైగా భూములను కాపాడుకునేందుకు యత్నించారని, అందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డు తగలడంతో, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఏసీబీకి పట్టుబడటంతో వారి నిజస్వరూపం బట్టబయలు అయిందని, ఆగస్టు చివరిలోగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం వస్తుందని అంచనా వేశారు. టీడీపీ నేతలు తమ భవిష్యత్తు కోసం బాబుపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News