: ఈ ఫోన్ బిల్డప్పులేంటి?: అధికారులపై ఏపీ సీఎం నిప్పులు
పుష్కరాలు రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోరా? అని ప్రశ్నించారు. పనులన్నీ పూర్తయిపోయినట్టు ఫోన్లో బిల్డప్పులిస్తున్నారని, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మండిపడ్డారు. పుష్కర పనులను ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. యాత్రికులకు ఇబ్బందులు కలిగితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. డ్రెయిన్లలో పూడికను తీయించని శానిటేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం యుద్ధప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.