: తిరుపతిలో ప్రత్యక్షమైన చిరంజీవి!


గత కొంతకాలంగా మీడియాకు కనిపించని మెగాస్టార్ చిరంజీవి తిరుపతికి వచ్చారు. ఆయన తనయుడు రామ్ చరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రూజెట్ విమానాలను నేటి నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో చిరంజీవి శ్రీవారి ఆశిస్సుల కోసం వచ్చారు. తిరుమలకు చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్ తదితరులకు రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికారు. ఆపై ఆలయానికి వెళ్లిన వారు మహాలఘు దర్శనంలో భాగంగా దేవదేవుని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజ, అల్లుడు, మనవరాళ్లు, వియ్యంకులు, బంధువులు మొత్తం కలిసి 18 మంది రాగా, దర్శనం ఏర్పాట్లను టీటీడీ సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షించారు. చిరంజీవిని పలకరించడానికి, కరచాలనం చేసేందుకు అభిమానులు, ఉద్యోగులు ఎగబడ్డారు.

  • Loading...

More Telugu News