: మనిషి తెలంగాణలో, మనసు కోనసీమలో!: రేవంత్ పై టీఆర్ఎస్ ఫైర్


రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రాంతంలోని కొడంగల్‌ కు ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన మనసంతా ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ చుట్టే తిరుగుతోందని తెరాస నేతలు విరుచుకుపడ్డారు. ఏపీకి చెందిన బడా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల తరఫున ఆయన వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ రాములునాయక్‌ లు విమర్శించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఉంటూ ఇక్కడి వారికే ద్రోహం చేస్తున్న వ్యక్తి రేవంతేనని నిప్పులు చెరిగారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు నీరందించేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపడితే, రేవంత్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News