: బ్రిటన్ రాజు గారికి కోపమొచ్చింది!
రాజు గారికి కోపమొచ్చింది. ఈ కాలంలో రాజులెవరు? అని ఆశ్చర్యపోకండి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ కి పట్టరాని ఆగ్రహం వచ్చింది. దీంతో ఫోటోగ్రాఫర్ చెంప ఛెళ్లుమనిపించారు. 1940వ సంవత్సరంలో 'బాటిల్ ఆఫ్ బ్రిటన్' జరిగి జూలై 10కి 75 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజప్రాసాదంలో రాయల్ షో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ షోలో యుద్ధ విమానాలు విన్యాసాలు చేశాయి. ఈ ప్రదర్శనను రాయల్ ఫ్యామిలీ బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి వీక్షించింది. ఈ సందర్భంగా ఓ ఫోటో గ్రాఫర్ రాయల్ ఫ్యామిలీని ఫోటోలు తీసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో నిగ్రహం కోల్పోయిన ప్రిన్స్ ఫిలిప్ ఆగ్రహంతో అతని చెంప ఛెళ్లుమనిపించారు.