: అమెరికా వైమానిక దాడుల్లో ఐఎస్ఐఎస్ అగ్రనేత ఖతం
వరుస దాడులు, కిడ్నాపులు, భీకర హత్యలతో ప్రపంచానికి సవాలు విసురుతున్న ఇస్లామిక్ స్టేట్ సంస్థ (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొండలు, గుట్టల్లో దాక్కుంటూ ప్రపంచానికి హెచ్చరికలు చేస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ అగ్రనేత హఫీజ్ సయూద్ ఖాన్ ను అమెరికా సైన్యం మట్టుబెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లోని మారుమూల ప్రాంతంలో ఉగ్రవాదులపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో సయీద్ ఖాన్ మృతి చెందాడు.