: అనంతపురం జిల్లాలో 20 వేల నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు


అనంతపురం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోంది. నిన్న ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, నేడు తమిళనాడులోని శివకాశి నుంచి ఆనంద్ పేరిట వచ్చిన నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి, భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. నవత ట్రాన్స్ పోర్ట్ లో ఈ పాసుపుస్తకాలు ఉన్నాయన్న సమాచారంతో, దాడులు నిర్వహించగా, సుమారు 20 వేల నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు దొరికాయి. దీంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లాలో నాలుగు దఫాలుగా జరిగిన దాడుల్లో 17 వేలకుపైగా నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను సీజ్ చేసినట్టు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ పాసుపుస్తకాల కుంభకోణంలో ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News