: బ్రిటన్ లో ముగ్గురమ్మాయిలు ఎంపీ కొడుకుని చావచితక్కొట్టారు


ముగ్గురు యువతులు ఎంపీ కొడుకుని చావచితక్కొట్టిన ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. బ్రిటన్ లోని మహిళా ఎంపీ విక్టోరియా బోర్విక్ కుమారుడు టామ్ బోర్విక్ (27)ను ముగ్గురు యువతులు వెంటపడి కొట్టారు. లండన్ లోని లీస్టర్ స్క్వేర్ కు సమీపంలో ఉన్న కేఎఫ్ సీ సెంటర్ లోని కౌంటర్ దగ్గర స్నేహితులతో కలిసి టామ్ బోర్విక్ ఫుడ్ కోసం వేచి చూస్తుండగా, చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో క్యూలో నిల్చున్న ఓ యువతి అకస్మాత్తుగా టామ్ పై పిడిగుద్దులు కురిపించింది. ఆమె దాడిని తట్టుకోలేక టామ్ పారిపోతుండగా, ఆమె స్నేహితులు మరో ఇద్దరు జతకలిసి టామ్ ను పట్టుకుని చావచితక్కొట్టారు. అక్కడి సెక్యూరిటీ ముందే ఈ తతంగం జరగడం విశేషం. వారి దెబ్బలకు తాళలేక టామ్ స్పృహ కోల్పోయాడు. దీంతో అతనిని ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News