: నాగాలాండ్ ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించడంపై ప్రజాసంఘాల తీవ్ర నిరసన


ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ ను కేంద్ర ప్రభుత్వం అత్యంత కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. దీనిపై ఆ రాష్ట్రంలోని ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే, నాగాలాండ్ ను కల్లోలిత ప్రాంతంగా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తనకు ఏమాత్రం తెలియదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో కిరణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయని... అయినా, ఇలాంటి ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాజా నిర్ణయం, గత నెల 30 నుంచి అమల్లోకి వచ్చినట్టు భావించాలని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News