: అమల పర్యావరణ పరిరక్షణ సూత్రాలు
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని నటి అమల అన్నారు. చెత్త నుంచి అలంకరణ వస్తువులు తయారు చేసుకోవడం, వంటగదిలో చెత్తను కంపోస్ట్ ఎరువు కోసం ఉపయోగించుకోవడం పర్యావరణానికి ప్రయోజనదాయకమన్నారు. హైదరాబాద్ లోని బేగంపేటలో ఎడ్డిస్టోర్ రీసైకిల్ పేరుతో ఏర్పాటైన ప్రదర్శనను అమల ఈ రోజు సందర్శించారు. పనికిరాని పేపర్లు, టెట్రాప్యాక్ లతో అలంకరణ వస్తువులు తయారు చేయడం అభినందనీయమని అన్నారు.