: వివాహితను అపహరించిన కిడ్నాపర్...రూ.3 లక్షలివ్వకుంటే ‘రెడ్ లైట్’లో అమ్మేస్తానంటూ బెదిరింపు
హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో నేటి ఉదయం కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. వివాహితను అపహరించిన ఓ వ్యక్తి రూ.3 లక్షలివ్వాలని ఆమె కుటుంబసభ్యులకు తేల్చిచెప్పాడు. అడిగినంతమేర డబ్బివ్వకుంటే, వివాహితను ముంబై రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తానంటూ అతడు బెదిరిస్తున్నాడు. ఈ మేరకు ఆమె కుటుంబసభ్యులకు ఆ కిడ్నాపర్ వాట్సప్ లో ఫోటోలతో పాటు మెసేజ్ పెట్టాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీపై ఆరా తీశారు. ప్రస్తుతం అతడు ఒడిశాలో ఉన్నట్లు గుర్తించారు. వివాహితను కిడ్నాపర్ నుంచి కాపాడేందుకు చర్యలు చేపట్టారు.