: ‘డొక్కా’ నాకు సోదర సమానుడు...మాతోనే ఉంటాడు: రాయపాటి ఆసక్తికర వ్యాఖ్య


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీ మారే విషయంపై గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందించారు. కాంగ్రెస్ ను వీడనున్న డొక్కా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని నిన్న ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. రాయపాటిని రాజకీయ గురువుగా భావించే డొక్కా... తన గురువు టీడీపీలోకి వెళ్లినా, ఆయన మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలకు ఆయన దాదాపుగా దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్న డొక్కా, వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. దీనిపై డొక్కా నోరు మెదపకున్నా, తన శిష్యుడిని వైసీపీలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు రాయపాటి రంగంలోకి దిగారు. ‘‘డొక్కా మాకు సోదరుడు లాంటివారు. ఆయన మాతోనే ఉంటారు. టీడీపీలో చేరతాడు’’ అంటూ రాయపాటి వ్యాఖ్యానించారు. మరి, దీనిపై శిష్యుడు ఎలా స్పందిస్తాడో చూడాలి!

  • Loading...

More Telugu News