: మాస్క్ లేనిదే బతకడం కష్టం...అయినా ఇష్టంగా బతికేస్తున్నారు


జన్మభూమిపై ఎలాంటి వారికైనా మమకారం ఉంటుంది. మరపురాని అనుభూతులు గూడుకట్టుకోవడం వల్ల, ఎప్పుడైనా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే, పుట్టిన ప్రాంతాన్ని వదిలేందుకు ఎవరూ ఇష్టపడరు. అయితే ప్రాణాంతకమని తెలిసినా జపాన్ వాసులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధపడడం లేదు. ముఖాలకు మాస్క్ లు ధరించి మరీ బతికేస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యోకు 180 కిలోమీటర్ల దూరంలో మియాకేజీమా అనే దీవి ఉంది. ఈ ద్వీపంలో నిత్యం విషవాయువులు వెలువడుతూనే ఉంటాయి. 2000వ సంవత్సరంలో జూన్ 21- జూలై 26 మధ్యలో 17,500 అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. దీంతో అక్కడ నివసించే 3,600 మంది ద్వీపాన్ని వీడారు. 2,884 మంది ద్వీపాన్ని వీడలేదు. వీరంతా 24 గంటలూ ఆక్సిజన్ మాస్క్ లు ధరిస్తూ జీవించేస్తున్నారు. వారికి తమ మట్టి మీద మమకారం అలాంటిది మరి!

  • Loading...

More Telugu News