: ఒకే చోట...భార్యతో సచిన్, ప్రియురాలితో కోహ్లీ!


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒకే చోట దర్శనమిచ్చారు. భార్యతో సచిన్ సందడి చేస్తే, ప్రియురాలితో కోహ్లీ సందడి చేశాడు. ఇంగ్లండ్ లో వింబుల్డన్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ లోని వీఐపీ బాక్స్ లో సచిన్ గతంలో సందడి చేశాడు. తన అభిమాన ఆటగాడు ఫెదరర్ విన్యాసాలు చూస్తూ సేదదీరుతాడు. అయితే ఈసారి సచిన్ కు కోహ్లీ జత కలిశాడు. జంకోవిచ్, గ్యాస్కెట్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు భార్య అంజలితో సచిన్ రాగా, ప్రియురాలు అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ వచ్చాడు. వీరంతా పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ ఆసాంతం వీక్షించడం విశేషం. వీరు నలుగురూ కలిసి మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోలను వింబుల్డన్ అధికారిక వెబ్ సైట్ లో పోస్టు చేసింది.

  • Loading...

More Telugu News