: వాట్స్ యాప్ పై నిషేధానికి యూకే సన్నాహాలు!


ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ప్రజాదరణ పొందిన వాట్స్ యాప్ పై యూకే సర్కారు నిషేధం విధించేందుకు కసరత్తులు చేస్తోంది. యూకేలో ప్రస్తుతం వాట్స్ యాప్ తో పాటు ఐమెసేజ్, స్నాప్ చాట్ వంటి ఎన్నో మెసేజింగ్ సర్వీసులను వినియోగిస్తున్నారు. అయితే, కోడ్ భాషలో మెసేజ్ లు పంపుకోవడం పట్ల బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఆయన మాట్లాడుతూ... మనం చదవడానికి వీల్లేని సందేశాలు దేశంలోని ప్రజల మధ్య నడుస్తుంటే వాటిని అనుమతించాలా? అని ప్రశ్నించారు. అందుకు జవాబు కూడా ఆయనే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు అని పేర్కొన్నారు. ఈ మెసేజింగ్ సర్వీసులపై నిషేధం కోసం ఓ చట్టం తీసుకువచ్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ చట్టం కోసం కామెరాన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News