: ఒక్క ఐడియా...ప్రాణం మీదికి తెచ్చింది


ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది...ఆ సంగతేమో కానీ, ఆ ఒక్క ఐడియా అతని ప్రాణం తీసినంత పని చేసింది. వివరాల్లోకి వెళ్తే... స్కాట్ లాండ్ లోని నార్త్ లాంక్ షైర్ కు చెందిన జేమ్స్ మెక్ ఎల్వార్ 19 ఏళ్ల గాయకుడు రాక్ బ్యాండ్ తో కలిసి గ్లాస్గో నుంచి లండన్ వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం గ్లాస్గో ప్రయాణమయ్యాక, లగేజీ ఎక్కువగా ఉండడంతో విమానాశ్రయాధికారులు అతనిని విమానంలో ఎక్కేందుకు అనుమతించలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక, కాస్సేపు ఆలోచించిన జేమ్స్, 'గుడ్ ఐడియా' అంటూ ఒకదానిపై ఒకటి 12 బట్టలు ధరించి, ఈజీ జెట్ విమానం ఎక్కేశాడు. తర్వాత విమానంలో ఉక్కపోతకు తట్టుకోలేకపోయాడు. విపరీతంగా చెమటలు కక్కుతూ, ఊపిరి తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతూ, విమానంలో కుప్పకూలిపోయాడు. దీంతో అతనికి ప్రాథమిక చికిత్స చేసిన విమాన సిబ్బంది, విమానం ల్యాండ్ కాగానే ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు అతను కోలుకున్నాడు. ఈ విషయాన్ని ఆ రాక్ బ్యాండ్ ట్విట్టర్లో తెలపడంతో విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. కాగా, జేమ్స్ ధరించిన దుస్తుల్లో జంప్ సూట్స్, జీన్స్, టీషర్టులు, షర్టులు, రెండు టోపీలు ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News