: బాహుబలి ప్రదర్శనలో విద్యుత్ సమస్య...తెర చించేసిన అభిమానులు
'బాహుబలి' సినిమాపై నెలకొన్న అంచనాలు సినిమా ధియేటర్ల యాజమాన్యాలకు చిక్కులు తెచ్చి పెడుతోంది. అభిమానుల అత్యుత్సాహం సినిమా ధియేటర్ల యాజమాన్యాలకు చేదు అనుభవాలు మిగులుస్తోంది. సినిమా చూసి ఆహ్లాదకర వాతావరణంలో ఇళ్లకు చేరాల్సిన అభిమానులు, విపరీత చేష్టలతో సమస్యలు తెస్తున్నారు. తాజాగా, వరంగల్ లో 'బాహుబలి' సినిమా ప్రదర్శిస్తున్న సుశీల్ ధియేటర్ లో అభిమానులు బీభత్సం సృష్టించారు. సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంలో జరిగిన ఆలస్యాన్ని భరించలేని ప్రేక్షకులు ఆగ్రహంతో ఫర్నిచర్ ధ్వంసం చేసి, తెరను చించేశారు. అనంతరం ధియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.