: నేనడిగిన ప్రశ్నలకు ఏసీబీ అధికారులు జవాబు చెప్పలేదు: సండ్ర


రెండు రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ తాను సమాధానం చెప్పానని 'ఓటుకు నోటు' కేసులో ఐదవ ముద్దాయి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఈ సాయంత్రం ఏసీబీ ప్రత్యేక కోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తానూ వారిని కొన్ని ప్రశ్నలు అడిగానని, తాను అడిగిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానమే లేదని ఆయన అన్నారు. తమ ఎమ్మెల్యేలను తెలంగాణ సర్కారు ప్రలోభపెట్టి చేర్చుకోలేదా? అని ప్రశ్నించానని, తక్కువ ఎమ్మెల్యేలుండి కూడా అన్ని ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ఎస్ గెలవడానికి కారణమేంటని అడిగానని ఆయన అన్నారు. నేటితో ఏసీబీ కస్టడీ ముగిసిన సండ్రను అధికారులు కోర్టులో హాజరు పరిచిన అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News