: జపాన్ పర్యటన సంతృప్తి కలిగించింది: సీఎం చంద్రబాబు


జపాన్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. జపాన్ లో పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపామని, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించామని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ ముందుకొచ్చిందని బాబు తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జపాన్ పర్యటన వివరాలను వెల్లడించారు. జైకా, జెబిక్ వంటి ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో చర్చించామని, ఫిజి ఎలక్ట్రికల్ ను కలసి రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని చెప్పారు. ఆక్వాపై మయకావో కార్పొరేషన్ శ్రద్ధ చూపిందన్నారు. విశాఖ-చెన్నై కారిడార్ ఏడీబీ ప్రాజెక్టు రిపోర్ట్ తయారుచేశారని, అమరావతిలో మిజహో బ్రాంచి పెట్టాలని కోరామని అన్నారు. నూతన రాజధానిలో భాగస్వాములయ్యేందుకు చాలా మంది ముందుకొచ్చారని బాబు తెలిపారు. ఫార్మా రంగంలో ఐసీఐజేతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆలోచిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News