: డీఎస్... బంగారు తెలంగాణ కాదు, ముందు హైదరాబాదులో చెత్త ఊడ్చు: వీహెచ్
కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన డి.శ్రీనివాస్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో హైదరాబాదు చెత్తతో నిండిపోయిందని... బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ లో చేరిన డీఎస్... ముందు హైదరాబాదులో చెత్త ఊడ్చాలని అన్నారు. ప్రధాని మోదీ కూడా నగరంలో చెత్త ఊడ్చాలంటూ తన భజనపరులను ఆదేశించాలని కోరారు. 2జీ స్కాంపై నానా హంగామా చేసిన మోదీ... వ్యాపం స్కాంలో ఎంతో మంది చనిపోతున్నప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.