: అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి, వాయుగుండంగా మారిందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. జార్ఖండ్ లోని రాంచీకి 30 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్ గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్ర, తెలంగాణలో చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.