: గంగూలీకి అమూల్యమైన సలహా ఇచ్చిన సచిన్!
సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్... ఈ జంట ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పినన్ని రికార్డులు మరెవరికీ సాధ్యం కాలేదు. దాదాపు 15 సంవత్సరాల పాటు నడిచిన వీరి డ్రస్సింగ్ రూం స్నేహం ఆపైన కూడా కొనసాగుతోంది. తాజాగా గంగూలీ 43వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న వేళ సచిన్ ఓ అమూల్య సలహాను ఇచ్చాడు. "హ్యాపీ బర్త్ డే దాదా... ఎప్పటికీ యువకుడిగానే ఉండు" అని తన ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపాడు. కాగా, వీరిద్దరి భాగస్వామ్యంలో 6,609 పరుగులు, 21 సెంచరీలు లభించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిలో ఒకరు సెంచరీ చేసిన అత్యధిక మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. తమ మధ్య అండర్-14 మ్యాచ్ లు ఆడినప్పటి నుంచి స్నేహబంధం ఉందని గంగూలీ వెల్లడించారు.