: 'బాహుబలి' అభిమానులను బాదిన బౌన్సర్లు... సాక్షి విలేకరికి కూడా గాయాలు


ఆన్ లైన్లో టెక్కెట్లను విక్రయించడం వల్ల కావచ్చు, లేకపోతే థియేటర్ల యాజమాన్యమే బ్లాక్ లో టికెట్లను అమ్మడం వల్ల కావచ్చు... థియేటర్ల వద్ద క్యూలో నిలబడ్డ అభిమానులకు టికెట్లు దొరకని పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో, హైదారాబాద్ అత్తాపూర్ లో ఉన్న ఈశ్వర్ థియేటర్ వద్ద టికెట్లు దొరకడం లేదని, బ్లాక్ లో అమ్ముకుంటున్నారని అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో, ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. దీంతో, అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అంతేకాదు, ఇంతకాలం సెలబ్రిటీలకే రక్షణగా నిలచిన బౌన్సర్లు... ఇప్పుడు థియేటర్ కు కూడా రక్షణగా నిలిచారు. వారు కూడా అభిమానులపై విరుచుకుపడ్డారు. దీన్నంతా చిత్రీకరిస్తున్న మీడియాను కూడా వదల్లేదు. ఈ దాడిలో సాక్షి విలేకరితో పాటు మరికొంత మందికి గాయాలయ్యాయి. అయితే, ఇంత జరుగుతున్నా, పోలీసులు పట్టించుకోకపోవడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News