: విజయవాడలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన... తహశీల్దార్ వనజాక్షితో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు
కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ పై దాడికి నిరసనగా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నిన్న చెప్పినట్టుగానే విధులు బహిష్కరించి, కార్యాలయాలకు తాళాలు వేశారు. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తహశీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళా తహశీల్దార్ పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు తహశీల్దార్ వనజాక్షితో ఫోన్ లో మాట్లాడారు. ఇసుక రీచ్ గొడవపై సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇటు రెవెన్యూ ఉద్యోగులతో చర్చించి సమస్య పరిష్కరించాలని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను సీఎం ఆదేశించారు.