: సొలోమాన్ దీవులను కుదిపేసిన భూకంపం


పసిఫిక్ మహాసముద్రం దక్షిణభాగంలోని సొలోమాన్ దీవులను భూకంపం కుదిపేసింది. శుక్రవారం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.5గా నమోదైంది. సొలోమాన్ ఐలాండ్స్ రాజధాని హోనియారాకు పశ్చిమంగా 165 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడి కాలేదు. ఈ భూకంపం కారణంగా సునామీ ప్రమాదం లేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో భూకంపాలు సర్వసాధారణమన్న సంగతి తెలిసిందే. సొలోమాన్ దీవుల్లో ఇంతక్రితం కూడా పలుమార్లు భూకంపాలు సంభవించాయి.

  • Loading...

More Telugu News