: ఈ నెల 12 నుంచి హీరో రామ్ చరణ్ 'ట్రూజెట్' విమాన సర్వీసులు


సినీ హీరో రామ్ చరణ్ 'ట్రూజెట్' పేరుతో దేశీయ విమానయాన రంగంలోకి ప్రవేశించారు. ఈ విమాన సర్వీసులు ఈ నెల 12 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవలే కేంద్ర పౌరవిమానయాన శాఖ చరణ్ విమానాలకు అన్ని అనుమతులు ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఈ సందర్బంగా చెప్పారు. పన్నెండవ తేదీ నుంచి హైదరాబాద్-తిరుపతి, రాజమండ్రి సర్వీసులు, 15 నుంచి చెన్నై-రాజమండ్రి సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 26 నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య కూడా సర్వీసులు నడుపుతామన్నారు.

  • Loading...

More Telugu News