: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చంద్రబాబు భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. సీఎంతో పాటు పలువురు టీడీపీ ఎంపీలు కూడా మంత్రి కార్యాలయంలో జరిగిన భేటీలో పాల్గొన్నట్టు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రితో చంద్రబాబు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. తరువాత 12 గంటలకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బాబు భేటీ అవుతారు. జపాన్ పర్యటన ముగించుకుని నిన్న(గురువారం) సీఎం, ఆయన బృందం నేరుగా ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.