: కూకట్ పల్లిలో 'బాహుబలి' చూసిన జక్కన్న... నమస్తే అంటూ మాట్లాడకుండానే నిష్క్రమణ!
దర్శకుడు రాజమౌళి తన కలల పంట 'బాహుబలి'ని కూకట్ పల్లి భ్రమరాంబిక-మల్లికార్జున సినీ కాంప్లెక్స్ లో వీక్షించారు. జక్కన్న ఈ సినిమా చూసేందుకు భార్య రమ, సోదరుడు, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, వదిన శ్రీవల్లి, హీరోయిన్ అనుష్క తదితరులతో కలిసి వచ్చారు. ప్రదర్శన అనంతరం ఆయన స్పందన కోరేందుకు మీడియా ప్రయత్నించింది. అయితే, ఆయన చెక్కుచెదరని చిరునవ్వుతో మీడియా ప్రతినిధులకు నమస్తే పెట్టి, ఇప్పుడేమీ మాట్లాడబోనంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు.