: నాడు డ్రగ్స్ పట్టుకున్న ఎఫ్బీఐ హీరో... నేడు వాటికే బానిస!


మ్యాథ్యూ లారీ, ఒకప్పుడు యూఎస్ ఎఫ్బీఐలో మంచి పేరున్న ఆఫీసర్. యువత జీవితాలను చిత్తు చేస్తున్న డ్రగ్స్ రాకెట్లను పట్టుకోవడంలో నేర్పరి. కానీ ఇప్పుడు ఆ డ్రగ్స్ కే బానిసై, హెరాయిన్ దొంగతనం చేస్తూ పట్టుబడి దొరికిపోయాడు. అతను సాక్ష్యాలు మార్చిన కారణంగా సుమారు 12 మంది డ్రగ్స్ సరఫరాదారులపై యూఎస్ ప్రాసిక్యూటర్లు కేసులను ఎత్తివేయాల్సి వచ్చిందట. గత కొంతకాలంగా పెద్ద పేగుల్లో సమస్యతో బాధపడుతున్న మ్యాథ్యూకు వైద్య పరీక్షలు చేయించగా, ప్రిస్క్రిప్షన్ పెయిన్ కిల్లర్స్ కు అలవాటు పడ్డాడని, హెరాయిన్ తీసుకుంటూ దానికి బానిసైనాడని వెల్లడైంది. దీంతో ఎఫ్బీఐ అతనిపై కేసు పెట్టింది. తన శారీరక దృఢత్వాన్ని కాపాడుకునేందుకు అతను మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడని విచారణ అధికారులు తేల్చారు. కోర్టు విచారణ అనంతరం అతనికి భారీ శిక్షపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News