: హోండా కార్లలో లోపాలు... 45 లక్షల కార్లను వెనక్కి రప్పించిన కంపెనీ


తాము విక్రయించిన కార్లలో తయారీ లోపాలు చోటుచేసుకున్నాయంటూ హోండా మోటార్ కార్పొరేషన్ 45 లక్షల కార్లను వెనక్కి రప్పించింది. ప్రపంచవ్యాప్తంగా 2007 నుంచి 2011 మధ్య విక్రయించిన కార్లలో ఎయిర్ బ్యాగ్స్ వేడికి పగిలిపోతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్ బ్యాగ్స్ ను తకాతా కార్ప్ సంస్థ తయారు చేసిందని, వీటి స్థానంలో కొత్త వాటిని అమర్చనున్నామని వివరించింది. ప్రధానంగా డ్రైవర్ ముందు అమర్చిన ఎయిర్ బ్యాగ్ లలో ఈ సమస్య అధికంగా ఉందని సంస్థ వివరించింది.

  • Loading...

More Telugu News