: టీమిండియాతో సిరీస్ కు ఆస్ట్రేలియా రెడీ...సంక్రాంతికి సందడే!
2016 జనవరిలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న వన్డే, టీ20 సిరీస్ తేదీలు ఖరారయ్యాయి. భారత్-ఆస్ట్రేలియా జట్లు ముందుగా 2016 జనవరి 12న పెర్త్ వేదికగా తలపడనున్నాయి. ఈ సిరీస్ లో రెండు జట్లు 5 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడనున్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంచి ఒరవడి సృష్టించాలని భావిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ మైక్ మెక్ కెన్నా అన్నారు. గత వరల్డ్ కప్ సందర్భంగా సెమీఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆడిన మ్యాచ్ ను 30 కోట్ల మంది క్రీడాభిమానులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించారని ఆయన పేర్కొన్నారు. ఈ సిరీస్ కు కూడా అంతే ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.