: బాలకృష్ణ నివాసం ఎదుట ఎడ్ల బండ్లతో నిరసన


అనంతపురం జిల్లా పరిగి మండలం శాసనకోట గ్రామస్తులు హిందూపురంలోని నందమూరి బాలకృష్ణ నివాసం ఎదుట ఎడ్ల బండ్లతో నిరసన తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇసుక తెచ్చుకుంటుంటే పోలీసులు అడ్డుకుని వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వారు కోరారు. శాసనకోట వద్ద పెన్నా నది నుంచి ప్రతిరోజూ పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారని, ఆ విషయాన్ని పట్టించుకోని పోలీసులు తమను మాత్రం వేధిస్తున్నారని వారు మండిపడ్డారు. ఒక చలానాను కలర్ జిరాక్స్ తీసి, ఆ కాపీలను ఒరిజినల్ చలానాలుగా చూపి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని వారు వివరించారు.

  • Loading...

More Telugu News