: జింబాబ్వే జట్టును తేలిగ్గా తీసుకోవడం లేదు: రహానే
జింబాబ్వే జట్టును తేలిగ్గా తీసుకోవడం లేదని టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే చెప్పాడు. తాజాగా పాకిస్థాన్ పర్యటన ముగించిన జింబాబ్వే పాక్ కు గట్టిపోటీ ఇచ్చిందని తెలిపాడు. టీమిండియాలో అంతా సన్నద్ధంగా ఉన్నారని రహానే చెప్పాడు. బంగ్లా పర్యటన ఫలితాన్ని పూర్తిగా మర్చిపోయామని, జింబాబ్వే పర్యటనలో విజయం సాధించడంపైనే దృష్టి పెట్టామని రహానే స్పష్టం చేశాడు. టీమిండియాకు అన్ని వనరులు ఉన్నాయని, మైదానంలో రాణిస్తే సరిపోతుందని, తామంతా ఉత్తమ ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నామని రహానే వెల్లడించాడు. 2013లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేసిన రహానే, ఇప్పుడు కూడా అలాంటి ప్రదర్శన చేయాలని భావిస్తున్నామని చెప్పాడు.