: 6 లక్షల కోట్ల పనులతో 50 లక్షల మందికి ఉపాధి: నితిన్ గడ్కరీ
6 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఐదేళ్లలో 50 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేయనున్నామని అన్నారు. 5 లక్షల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టనున్నామని, లక్ష కోట్ల రూపాయలతో నౌకాశ్రయాల నిర్మాణం చేపట్టనున్నామని ఆయన తెలిపారు. జాతీయ రహదారులు, నౌకాశ్రయాల నిర్మాణం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగాలు తరలి రానున్నాయని ఆయన చెప్పారు. శ్రీలంక తో అనుసంధానానికి 22 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపట్టనున్నామని ఆయన తెలిపారు.