: ఏపీకి తెలంగాణ నీటి పారుదలశాఖ లేఖ


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ నీటి పారుదల శాఖ లేఖ రాసింది. పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో తామెలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని లేఖలో పేర్కొంది. 2013లోనే ఎత్తిపోతల పథకానికి పాలనా అనుమతులు వచ్చాయని లేఖలో వెల్లడించింది. పాలమూరు కొత్త ప్రాజెక్టు అని, నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ సీఎం చంద్రబాబు కేంద్ర జలవనరుల సంఘానికి లేఖ రాయడంపై నీటి పారుదల శాఖ స్పందిస్తూ పైవిధంగా లేఖ రాసింది. మరోవైపు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్న బాబు మహబూబ్ నగర్ జిల్లా ద్రోహి అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News