: బాబుగారూ, ఆ గొంతు మీదో? కాదో? చెప్పండి!: సురవరం
ఓటుకు నోటు కేసులో బయటకు వచ్చిన ఆడియో టేపుల్లో ఉన్న గొంతు తనదో? కాదో? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. లేకపోతే, కనీసం స్వర పరీక్షకైనా సిద్ధపడాలని సూచించారు. మరోవైపు, హైదరాబాదులో సెక్షన్-8 అవసరం లేనేలేదని సురవరం అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో బీజేపీపై ఆయన మండిపడ్డారు. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో వస్తున్న అవినీతి ఆరోపణలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అన్నారు. వ్యాపం కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ గవర్నర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో... గవర్నర్ ను బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే, కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ, ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.