: జపాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు... ఈ రాత్రికి అక్కడే!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. నిన్నటితో జపాన్ పర్యటన ముగించుకున్న ఆయన గత రాత్రి పయనమై నేరుగా హస్తినకే వెళ్లారు. ఈ రాత్రికి అక్కడే ఉండి రేపు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్ లతో బాబు సమావేశమవనున్నారు. ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8, తెలుగు రాష్ట్రాల జలవివాదం అంశాలపై సీఎం ప్రధానంగా చర్చించనున్నారు.