: కేసీఆర్ పుష్కరస్నానం చేసే స్థలం, రోజు, సమయం వివరాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ధర్మపురిలో పుష్కరస్నానం ఆచరించనున్నారు. ఈనెల 14వ తేది ఉదయం 6.21 గంటలకు ఆయన పుష్కరస్నానం చేస్తారు. ఈ వివరాలను టీఎస్ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రూ. 600 కోట్లతో కుంభమేళాను తలపించే రీతిలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పుష్కరాల ప్రారంభ సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని... భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.