: త్వరలోనే రాజీవ్ ఏవియేషన్ వర్శిటీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి: అశోక్ గజపతిరాజు


దేశంలో విమానయాన సంబంధిత కోర్సులను అందించేందుకు ఉద్దేశించిన రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్శిటీ త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. రాయ్ బరేలీలోని ఫుర్సాత్ గంజ్ లోని ఇందిరా గాంధీ నేషనల్ ఏవియేషన్ అకాడమీని పరిశీలించేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ... ఫుర్సాత్ గంజ్ లో ప్రతిపాదిత యూనివర్శిటీ త్వరలోనే పని ప్రారంభిస్తుందని అన్నారు. ఇక, దేశంలో ట్రైనీ పైలట్ల సంఖ్యతో పోల్చితే, శిక్షణ విమానాలు తగినన్ని లేకపోవడంపై స్పందిస్తూ, ట్రైనీ పైలట్లు, ఎయిర్ క్రాఫ్టుల మధ్య నిష్పత్తి త్వరలోనే మెరుగవుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News