: రేపు కృష్ణా జిల్లా రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు... విధులకు హాజరుకాబోమన్న ఉద్యోగులు
కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దారుపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు చేసిన దాడికి నిరసనగా జిల్లా రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేపట్టబోతున్నారు. ఈ మేరకు విజయవాడలో సమావేశమైన రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు... రేపటి నుంచి ఇసుక క్వారీల్లో విధులకు హాజరుకాబోమని ప్రకటించారు. రేపు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఆఫీసులకు తాళాలు వేస్తామని తెలిపారు. ఓ మహిళా ఉద్యోగిపై దాడి చేసి ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని రేకెత్తించారని మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్యే, ఆయన అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రేపు సాయంత్రం మరోసారి సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.