: 'మగధీర' సినిమా చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యా: ప్రభాస్
తాను, దర్శకుడు రాజమౌళి కబుర్లలో పడ్డామంటే తెల్లవారుజాము వరకు అలా మాట్లాడుకుంటూనే ఉంటామని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ అన్నాడు. ఛత్రపతి సినిమా తర్వాత తామిద్దరం చాలా క్లోజ్ అయ్యామని.. ఆయన ఓ విధంగా తనకు గురువులాంటి వారని చెప్పాడు. అనేక సందర్భాల్లో, 'నీతో ఒక భారీ సినిమా చేస్తా'నని రాజమౌళి అంటుండేవారని... ఆ తర్వాత 'మగధీర' సినిమాను నిర్మించారని... ఆ సినిమా చూసిన తాను షాక్ కు గురయ్యానని... తనతో తీస్తానన్న భారీ సినిమా అదే అయ్యుంటుందని భావించానని చెప్పాడు. ఆ తర్వాత బాహుబలికి ముందు నాలుగైదు కథలను తనకు వినిపించారని... వాటిలో బాహుబలి కథ బాగా నచ్చడంతో... ఈ సినిమాకే ఫిక్స్ అయ్యామని ప్రభాస్ వెల్లడించాడు. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం జీవితంలో ఒకసారే వస్తుందని ఎంతో ఆనందంగా చెప్పాడు.